జయహో… ISRO – చంద్రయాన్‌ 3 గ్రాండ్‌ సక్సెస్‌

నెల్లూరు, జూలై 14, (ఇయ్యాల తెలంగాణ) : జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటీ రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. మానవ మేథస్సుకు మచ్చుతునకలాంటి చంద్రయాన్‌`3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్ళింది. శాస్త్రవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ఆనందం అంబరాన్నంటింది. నింగికేగిన చంద్రయాన్‌ ? 3 యావత్‌ భారతాన్ని నిబిడాశ్చర్యంలో ముంచేస్తూ భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. మూడు దశలు పూర్తిచేసుకొని.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళుతోంది.  మధ్యాహ్నం 2.35 నిముషాలకు నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్‌ 3 స్పేస్‌క్రాఫ్ట్‌…విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్‌ 3 బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోవిూటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీన్ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి  ఒజీబీనిఞష్ట్ర పవష్ట్రతిఞశ్రీవ ఓజీతీస 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు చంద్రాయన్‌ `3 నింగిలోకి దూసుకెళుతోన్న దృశ్యాలు యావత్‌ భారతావనిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశాయి.మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించింది. రాకెట్‌ ప్రయోగాన్ని 3 దశల్లో నిర్వహిస్తుండగా.. చంద్రయాన్‌`3 ల్యాండర్‌, రోవర్‌ను ఎల్‌వీఎం రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్తుంది. 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం సాగనుంది. సుమారు 3.84 లక్షల కిలోవిూటర్లు ప్రయాణించనుంది. భూకక్ష్యలో 24 రోజులపాటు భ్రమణం చెందుతుంది. ఆగస్టు 23వ తేదీ లేదా 24వ తేదీన జాబిల్లిపైకి ల్యాండర్‌ చేరుతుంది.చంద్రయాన్‌`3 రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. 24 రోజుల పాటు భూకక్ష్యలో భ్రమణం చెంది.. ఆ తరువాత చంద్రునివైపు పయనించనుంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఈ చంద్రయాన్‌`3 ల్యాండ్‌ అవనుంది. కాగా, చంద్రయాన్‌ `3 ప్రయోగం సక్సెస్‌ అవడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు.

24 రోజుల పాటు భూమి చుట్టు ప్రదక్షిణ :

చంద్రయాన్‌ 3 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్‌ కక్ష్యలోకి దూసుకెళ్లింది. ప్రపల్షన్‌ మాడ్యూల్‌ రాకెట్‌ నుంచి విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్‌ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. చంద్రయాన్‌ 3 ని ఎల్వీఎం 3 రాకెట్‌ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది.. ఇక్కడ సాఫ్ట్‌ల్యాండిరగ్‌ అయితే…ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్టు లెక్క.ఈ ప్రయోగంపై స్పేస్‌ మినిస్టర్‌ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్పందించారు. ఈ చరిత్రలో భాగమవుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడిరచారు. ఇండియా మొత్తం గర్వపడేలా చేసినందుకు ఇస్రోకి అభినందనలు తెలిపారు. కౌంట్‌డౌన్‌ పూర్తౌెన వెంటనే రాకెట్‌ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో ఒక్కో దశను సక్సెస్‌ఫుల్‌గా దాటుకుంటూ వెళ్లింది రాకెట్‌. ఆ తరవాత ప్రపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోయి విజయవంతంగా చంద్రయాన్‌ 3 కక్ష్యలోకి చేరుకుంది. మూడో దశ పూర్తౌెన వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు అభినందనలు చెబుతూ సంబరాలు చేసుకున్నారు. 3.5లక్షల కిలోవిూటర్ల మేర ప్రయాణించిన తరవాత చంద్రయాన్‌ 3 చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది

శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం :

చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు. చంద్రయాన్‌ 3 ప్రతి భారతీయుడి కలల్ని, ఆకాంక్షల్ని మోసుకెళ్లిందని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం అని కొనియాడారు. ‘‘భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్‌ 3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్‌’’

`ప్రధాని నరేంద్ర మోదీ 

స్లింగ్‌ షాట్‌ తో ప్రయోగం

విూకు వడిసెల తెలుసు కదా. పొలాల్లో ప్రత్యేకించి కంకులు ఉండే మొక్కజొన్న లాంటి పొలాల్లో పిట్టలు వాలితే రైతులు వడిశెల చిన్న రాయిపెట్టి చేత్తో గిరగిరా తిప్పి విసురుతూ ఉంటారు. పిట్టలు రాయి శబ్దానికి ఎగిరి పారిపోతుంటాయి. జస్ట్‌ వాటిని తరిమేసేందుకు రైతులు ఈ టెక్నిక్‌ వాడుతూ ఉంటారు. దీన్ని ఇంగ్లీషులో స్లింగ్‌ షాట్‌ అంటారు.ఇప్పుడు ఇస్రో చంద్రుడి విూద ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్‌ మిషన్‌ కోసం ఈ స్లింగ్‌ షాట్‌ టెక్నాలజీనే వాడుతోంది. అంటే రాకెట్‌ ప్రయోగం జరిగిన వెంటనే చంద్రుడే లక్ష్యంగా దూసుకెళ్లటం కాకుండా ఇదిగో ఇలా భూమి చుట్టూ తిప్పి తిప్పి తిప్పి భూమి కక్ష్య దాని గురుత్వాకర్షణ శక్తి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేసి చంద్రుడి కక్ష్యలోకి అమాంతం వెళ్లటం అన్నమాట.మళ్లీ చంద్రుడు కక్ష్య చుట్టూ ఇలానే తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లటం. ఇలా చేయటం ద్వారా చాలా ఇంధనం ఆదా అవుతుంది. మాములుగా వడిశెల లో రాయి పెట్టి కొట్టిన దానికంటే గిరగిరా తిప్పి విసిరితేనే రాయి ఎక్కువ దూరం వెళ్తుంది. 

ఇదే సిద్ధాంతాన్ని అచ్చంగా అమలు చేస్తున్న ఇస్రో చంద్రుడిపై ప్రయోగాలకు పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ప్రయోగం కొంచెం లేట్‌ అవుతుంది. బట్‌ పర్లేదు. ఇదే మెరుగైన పద్ధతని ఇస్రో భావిస్తోంది. అందుకే చంద్రయాన్‌ 3 ప్రయోగం ఈరోజు జరిగితే చంద్రుడి విూద ల్యాండర్‌ దిగటానికి వచ్చే నెల 24, 25 వరకూ వేచి చూడాలి. ఇలా చేయటం ద్వారా ఖర్చు బాగా తగ్గించుకుంటున్న ఇస్రో చంద్రయాన్‌ 3 కోసం 615 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తూ నాసా కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....