జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు.. 4 గురు జవాన్లు మృతి

శ్రీనగర్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూ కశ్మీర్‌లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దెస్సా ప్రాంతంలో సోమవారం  రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో అధికారితో సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దెస్సా ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత వారం కఠువా జిల్లా మాచేడీలో సైనివాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు మృతి అమరులైన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్‌ గత రెండున్నర సంవత్సరాల నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....