జనసేనానికి ఇన్‌ స్టాలో ఫుల్‌ ఫాలోయర్స్‌

గుంటూరు, జూలై 6, (ఇయ్యాల తెలంగాణ ); పవన్‌ కల్యాణ్‌ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌ గా ఉంటారు. రాజకీయ అంశాలను తరచూ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు.: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌ గా ఉంటారు. ప్రజాసమస్యలు, వైసీపీ పాలనపై ఆయన తరచూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తుంటారు. ఇప్పటికే ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ లో పవన్‌ కల్యాణ్‌ ఖాతాలు ఉన్నాయి. తాజాగా ఆయన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఒక్క పోస్టు పెట్టకుండానే లక్షల మంది సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నారు. పవన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారన్న వార్తతో ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 లక్షల మంది ఫాలోవర్స్‌ వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతాకు ఉన్న ప్రొఫైల్‌ చిత్రాన్నే ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ కు పెట్టారు. పవన్‌ త ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా రాజకీయ అభిప్రాయాలను పంచుకుంటారని తెలుస్తోంది. ఇన్‌ స్టా గ్రామ్‌ బయోలో ‘ఏలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో .. జై హింద్‌!’ అని రాశారు. ఇన్‌ స్టాలో పవన్‌… పొలిటికల్‌ అప్‌డేట్స్‌ మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయిన పవన్‌… ఇటీవలె వారాహి విజయ యాత్ర తొలి విడత పూర్తి చేసుకున్నారు. వారాహి యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ రావడంతో రెండో విడత యాత్రకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు రాజకీయం, అటు సినిమా రంగాన్ని బ్యాలెన్స్‌ చేస్తున్నారు పవన్‌. వరుసగా సినిమాలు చేస్తూనే… ప్రజా సమస్యలపై స్పందిస్తూ రాజకీయాల్లోనూ దూకుడు పెంచారు. ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడే పవన్‌… సామాజిక మాధ్యమాల్లోనూ వైసీపీపై విమర్శలు చేస్తుంటారు. కార్టూన్స్‌, కొటేషన్లతో వైసీపీ నేతలకు చురకలు అంటిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జనసేన స్పీడప్‌ అయింది. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ తన అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధికారిక వెబ్‌ సైట్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌ ద్వారా తాను చెప్పదలుచుకున్నవి ముక్కు సూటిగా చెప్తున్నారు. తాజాగా ఇన్‌ స్టాలో ఎంట్రీ ఇచ్చిన పవన్‌.. తన అభిమానులు, కార్యకర్తలకు ఇకపై నిత్యం టచ్‌లో ఉండనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్‌ దూకుడు పెంచారు. యువతను ఆకట్టుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్‌ విూడియాను యాక్టివ్‌ అయ్యారు పపన్‌.జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఓ వైవు బ్రో, ఓజి, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు రాజకీయాలలో యాక్టివ్‌ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యమని అంటున్నారు. ‘వారాహి విజయ యాత్ర’ చేసిన పవన్‌… మొదటి విడత సక్సెస్‌ కావడంతో రెండో విడత యాత్ర ప్రారంభించడానికి రెడీ అయ్యారు. వారాహి మొదటి విడత యాత్రలో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటించారు. వారాహి యాత్రోల రోడ్‌ షోలు, బహిరంగ సభలు, జనవాణి కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలతో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు పవన్‌.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....