జనవరి 1 నుండి పూరిలోని జగన్నాథ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

భువనేశ్వర్‌ అక్టోబర్‌ 10 (ఇయ్యాల తెలంగాణ ):ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నీతి సబ్‌ కమిటీ నిర్ణయించింది. అయితే కొంత మంది భక్తులు.. అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ రంజన్‌ కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఆలయ గౌరవం, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ కొంతమంది భక్తులు అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్నారని, మతపరమైన మనోభావాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. జీన్స్‌లు ధరించడం, స్లీవ్‌ లెస్‌ దుస్తులు, హాఫ్‌ ప్యాంట్స్‌ ధరించి బీచ్‌లోకి వెళ్లిన మాదిరిగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. దేవాలయం పవిత్రమైన స్థలం.. వినోదాన్ని పంచే ప్రాంతం కాదని ఆయన స్పష్టం చేశారు. 2024, జనవరి 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు రంజన్‌ కుమార్‌ దాస్‌ పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....