‘ఛాంగురే బంగారురాజా’ September 15న విడుదల

రవితేజ ఆర్టీ టీమ్‌వర్క్స్‌,  ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్‌ 15న విడుదల

మాస్‌ మహారాజా రవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రోడ్యూసర్స్‌. ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేశారు.సెప్టెంబర్‌ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవు సినిమాకి బాక్సాఫీస్‌ దగ్గర ఫేవర్‌ కానుంది. ప్రధాన తారాగణంతో కూడిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ హ్యుమరస్‌ గా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

‘అ/నీ కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్‌ కార్తీక్‌ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్‌. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్‌ ఇదివరకే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు. ఇది ప్రధాన పాత్రలు,  కథాంశాన్ని పరిచయం చేసింది. టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.కృష్ణ సౌరభ్‌ సంగీతం సమకూరుస్తుండగా, సుందర్‌ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జనార్ధన్‌ పసుమర్తి డైలాగ్స్‌ రాసిన ఈ చిత్రానికి కార్తీక్‌ వున్నవా ఎడిటర్‌.త్వరలో ‘ఛాంగురే బంగారురాజా’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. నటీనటులు: కార్తీక్‌ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్‌ నోరోన్హా, అజయ్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....