చేప ఖరీదు అక్షరాలా 3లక్షల 30వేలు

కాకినాడ,జూలై 22 ( ఇయ్యాల తెలంగాణ ):కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్‌ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో..కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్‌ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కాచ్చిడి చేప. ఈ కారణంగానే చేపల వ్యాపారి దీన్ని అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్‌ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఔషధ గుణాలు కలిగిన కచ్చిడి చేప కోసం ఎదురుచూసే మత్స్యకారులకు ఇది ఒక వరమనే చెప్పాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....