హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఇయ్యాల తెలంగాణ) : స్వర్గీయ డల్లు సత్యనారాయణ గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా రెయిన్బో హాస్టల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డల్లు యువసేన అధ్యక్షుడు డల్లు శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు శశి యాదవ్, అనిల్, సందీప్, కార్తీక్, రిషితో పాటు చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు జానీ, సుశీల్, భాస్కర్, నికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దివంగత డల్లు సత్యనారాయణ చేసిన సేవలను గుర్తు చేశారు. చిరస్మరణీయులుగా డల్లు నిలిచిపోతారని వక్తలు పేర్కొన్నారు. .
- Homepage
- Charminar Zone
- చిరస్మరణీయులు డల్లు Satya Narayana
చిరస్మరణీయులు డల్లు Satya Narayana
Leave a Comment
Related Post