చిత్ర గుప్త దేవాలయానికి ఎం ఐ ఎం పార్టీ శానిటైజ్ మెషిన్ బహుకరణ

చిత్ర గుప్త దేవాలయానికి  శానిటైజ్ మెషిన్ బహుకరిస్తున్న కార్పొరేటర్ అబ్దుల్ రహమాన్

హైదరాబాద్ జూన్ 8 ( ఇయ్యాల తెలంగాణ

కందికల్ గేట్ లోని చిత్రగుప్త దేవాలయానికి వచ్చే భక్తులు కరోనా మహమ్మారి భారిన పడొద్దని ఉదేశ్యంతో జంగమ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ శానిటైజ్ స్కానర్ మిషన్ ను దేవాలయానికి బహుకరించారు. ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు జంగమ్మెట్  డివిజన్ పరిధిలో ఎవరు కూడా కరోనా కు గురి కావొద్దనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండాలని పార్టీ కోరుకుంటుందని కోరారు. కుల మతాల కతీతంగా దేవాలయానికి శానిటైజ్ స్కానర్ ఇవ్వడంతో భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సభ సభ్యులు ఖాజా షరీఫ్ బాబా ఏస్సే డెవెలప్మెంట్ అధ్యక్షులు పులికంటి నరేష్ చిత్రగుప్త దేవాలయ చైర్మన్ మోహన్ రెడ్డి, సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....