చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ ‘మేమ్‌ ఫేమస్‌’ సాంగ్‌ లాంచ్‌

‘రైటర్‌ పద్మభూషణ్‌’ బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్‌ మ్యూజికల్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ని అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్‌ నాయక్‌ సంగీతం అందించిన ఫస్ట్‌ సింగిల్‌ అయ్యయ్యో ప్లజంట్‌ మెలోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, సెకండ్‌ సింగిల్‌ మినిమమ్‌ను లాంచ్‌ చేశారు. ఇది మొదటి దానికి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌. ఈ మాస్‌ నెంబర్‌ యూత్‌ స్టయిల్‌ స్వాగ్‌ ని చూపుతుంది. సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల  , మౌర్య చౌదరి దినచర్యను ప్రజెంట్‌ చేసింది. వారు రోజంతా చిల్‌ గా  ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు.మొదటి పాటను పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని పాడారు.  హై పిచ్‌ వోకల్స్‌తో మాస్‌ ఎనర్జీని నింపారు . కంపోజర్‌  కళ్యాణ్‌ నాయక్‌,  కోటి మామిడాలతో కలసి సాహిత్యం అందించారు. సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి గ్రావిూణ ప్రాంతాల్లో చిచోరా బ్యాచ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యూత్‌తో పాటు మాస్‌ని అలరించేలా ఉంది. శ్యామ్‌ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్‌, అరవింద్‌ మూలి ఆర్ట్‌ డైరెక్టర్‌.మేమ్‌ ఫేమస్‌ జూన్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.తారాగణం: సుమంత్‌ ప్రభాస్‌,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్‌ గౌడ్‌, కిరణ్‌ మచ్చ, అంజిమామ, శివ నందన్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....