హైదరాబాద్, ఆగష్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశం నలుమూలలా పండుగ వాతావరణం కనిపించింది. ఓల్డ్ సిటీ లోని చాంద్రాయణగుట్టలో ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్ర పటానికి పాలభి షేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ ను దేశ ఉన్నత న్యాయ స్థానం ఆమోదిస్తూ తీర్పును ఇవ్వడం పై ఎస్సీ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులికంటి నరేష్ ఆధ్వర్యంలో కందికల్ గేట్ భట్జి నగర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వర్ రావు,ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Charminar Zone
- చాంద్రాయణగుట్టలో SC డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో
చాంద్రాయణగుట్టలో SC డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో
Leave a Comment
Related Post