చంద్రబాబు Arrest పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన AP గవర్నర్‌ Abdul Nazeer

తనను గానీ, గవర్నర్‌ కార్యాలయంలో గానీ సీఐడీ అధికారులు సంప్రదించలేదు

 చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ)  :  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్‌ అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులోచంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు గవర్నర్‌ని గానీ, గవర్నర్‌ కార్యాలయంలో గానీ సీఐడీ అధికారులు సంప్రదించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. 2018లో చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిందే.కానీ, ప్రస్తుత గవర్నర్‌, 2021లో కేసు నమోదు చేసినప్పుడు ఉన్న గవర్నర్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం.ఈ రోజు చంద్రబాబును అరెస్టు చేసిన వ్యవహారం కూడా గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.విూడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్‌ తెలుసుకున్నారని వర్గాలు పేర్కొన్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....