చంద్రబాబు Arrest పైన డోన్‌ TDP నాయకుల నిరసనలు, ధర్నా, అరెస్ట్‌

మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అరెస్ట్‌ చేసినందుకు డోన్‌ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతూ, పాత బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది, అందుకు డోన్‌ డి యస్‌ పి శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేసారు, డోన్‌ టీడీపీ అభ్యర్థి మన్నే సుబ్బరెడ్డి పోలీస్‌ స్టేషన్లో డి యస్‌ పి తో మాట్లాడి తన పూచి పైన టీడీపీ నాయకులను స్టేషన్లో నుంచి వెంటనే విడుదల చేయించారు, ఈ సందర్బంగా డోన్‌ టీడీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి విూడియా తో మాట్లాడుతూ నంద్యాల లో మా టీడీపీ జాతీయ నాయకులు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నీ  , దారుణంగా 1000 మంది పోలీస్‌ సిబ్బంది తో అరెస్ట్‌ చేయడం దారుణం,అనవసరంగా ఆయన పైన లేనిపోని 17 కేసులు పెట్టి అర్ద రాత్రి అరెస్ట్‌ చేసారు, అందుకే రాష్ట్రము అంతటా నిరసనలు ధర్నా చేపట్టినందుకు చేపట్టారు,మా నాయకులు చంద్రబాబు ను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రము అంతటా అగ్ని గుండం గా మారిపోతుంది, అందుకు పోలీస్‌ వారు భాద్యులు అవుతారు, అనీ సుబ్బారెడ్డి అన్నారు,ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు చాటకొండ శ్రీనివాస్‌ లు, మురళి గౌడ్‌, మల్లికార్జున రెడ్డి,వలసల రామకృష్ణ, గంధం శ్రీనివాస్‌,సలీంద్ర శ్రీనివాస్‌ యాదవ్‌, యువ నాయకులు గౌతమ్‌ తదితరులు రెడ్డి తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....