ఘనంగా రాజ్‌ తరుణ్‌ ‘‘పురుషోత్తముడు’’ Movie టీజర్‌ లాంఛ్‌

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై డా.రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్‌ హీరోయిన్‌ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్‌ తుమ్‌ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్‌ ఖన్నా వంటి స్టార్‌ కాస్టింగ్‌ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ ను హైదరాబాద్‌ లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో

హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ` మా మూవీ టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి వచ్చిన విూడియా, గెస్టులకు థ్యాంక్స్‌. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్‌ డా. రమేష్‌ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్‌ రామ్‌ భీమనతో నాకు మంచి అండర్‌ స్టాండిరగ్‌ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్‌ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్‌ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్‌ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌. అందరూ బాగా వర్క్‌ చేశారు. జూన్‌ 6న పురుషోత్తముడు రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక డేట్‌ అనౌన్స్‌ చేస్తాం. మా మూవీని థియేటర్స్‌ లో చూసి ఎంకరేజ్‌ చేయండి. అన్నారు.

నిర్మాత ప్రకాష్‌ తేజావత్‌ మాట్లాడుతూ ` పురుషోత్తముడు సినిమా టీజర్‌ విూకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్‌ ను కూడా రిలీజ్‌ చేయబోతున్నాం.  విూ అందరి సపోర్ట్‌ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్‌ లో కలుద్దాం. అన్నారు.

యాక్టర్‌ రచ్చ రవి మాట్లాడుతూ ` మంచి కథా కథనాలతో, ప్యాడిరగ్‌ ఆర్టిస్టులతో పురుషోత్తముడు సినిమా విూ ముందుకు రాబోతోంది. మా ప్రొడ్యూసర్స్‌ చాలా మంచి వాళ్లు. వాళ్లకు సంచుల నిండా డబ్బులు ఈ సినిమాతో మిగలాలని కోరుకుంటున్నా. రాముడు, భీముడు కలిస్తే ఎలా ఉంటాడో అలాగే మా డైరెక్టర్‌ రామ్‌ భీమన ఉంటారు. సెట్‌ లో ఎవరినీ కష్టపెట్టకుండా వర్క్‌ చేయించుకున్నారు. చాక్లెట్‌ బాయ్‌ రాజ్‌ తరుణ్‌ కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ` పురుషోత్తముడు మంచి విందు భోజనం లాంటి సినిమా. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద నటీనటులతో మాలాంటి వాళ్లు కలిసి నటించే అవకాశం ఈ సినిమా కల్పించింది. మనసున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారికి, హీరో రాజ్‌ తరుణ్‌ కు పురుషోత్తముడు బిగ్‌ సక్సెస్‌ ఇవ్వాలి. అన్నారు.

లిరిసిస్ట్‌ బాలాజీ మాట్లాడుతూ ` ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ రామ్‌ భీమన గారికి థ్యాంక్స్‌. సినిమా షూటింగ్‌ టైమ్‌ లో ఆయనకు యాక్సిడెంట్‌ జరిగింది. అయినా పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా సినిమాను రూపొందించారు. రాజ్‌ తరుణ్‌ గారు ఈ కథలోని ఎమోషన్స్‌ ను వెయ్యింతలు తీసుకెళ్లారని రామ్‌ భీమన గారు చెబుతుండేవారు. టీమ్‌ అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్‌ వీరశంకర్‌ మాట్లాడుతూ ` రామ్‌ భీమనతో మాట్లాడితే పెద్ద విద్యావేత్తలా అనిపిస్తాడు. పురుషోత్తముడు టీజర్‌ చూస్తే రామ్‌ భీమన బీ, సీ సెంటర్స్‌ ఆడియెన్స్‌ కు కూడా రీచ్‌ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాడని తెలుస్తోంది. రాజ్‌ తరుణ్‌, రామ్‌ భీమన ఇద్దరి కెరీర్‌ లకు ఈ సినిమా నెక్ట్‌ స్టెప్‌ లాంటి సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్‌ రాజా రవీంద్ర మాట్లాడుతూ ` డైరెక్టర్‌ రామ్‌ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్‌ అయ్యాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్‌ చాలా కూల్‌ గా ఉండేవారు. మార్నింగ్‌ ఎలా ఉండేవారు సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్‌ చేశారు. చాలా పెద్ద ప్యాడిరగ్‌ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్నారు.

హీరోయిన్‌ హాసినీ సుధీర్‌ మాట్లాడుతూ ` ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ రామ్‌ భీమన గారికి థ్యాంక్స్‌. రాజ్‌ తరుణ్‌ షూటింగ్‌ టైమ్‌ లో బాగా సపోర్ట్‌ చేశారు. తెలుగు డైలాగ్స్‌ చెప్పడంలో హెల్ప్‌ చేశారు. మంచి ఎంటర్‌ టైనింగ్‌ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్‌ లో చూడండి. అన్నారు.

నిర్మాత డా.రమేష్‌ తేజావత్‌ మాట్లాడుతూ ` సినిమా నిర్మించాలని 30 ఏళ్ల కిందట అనుకున్నాను. పురుషోత్తముడు సినిమా కథను దర్శకుడు రామ్‌ భీమన గారు చెప్పగానే వెంటనే నచ్చి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాం. తెరపై నా పేరు ఉంది గానీ నా సోదరుడు ప్రకాష్‌, నా సతీమణి, పిల్లలు అంతా ప్రొడక్షన్‌ చూసుకున్నారు. పెద్ద ఆర్టిస్టులను మాట్లాడటం దగ్గర నుంచి అన్నీ పనులు వాళ్లే చేశారు. మా సినిమా వరకు పురుషోత్తముడు అంటే మా డైరెక్టర్‌ రామ్‌ భీమన. ఆయన ఈ సినిమానే జీవితంగా గడిపారు. యాక్సిడెంట్‌ జరిగినా షూటింగ్‌ కు వచ్చి అంతా చూసుకున్నారు. మా హీరోయిన్‌ ఫస్ట్‌ సినిమాకే ఇంత  డెడికేషన్‌ చూపించడం ఆశ్చర్యం వేసింది. ఆమెకు 102 డిగ్రీస్‌ జ్వరం ఉన్నా షూటింగ్‌ చేసింది. రాజ్‌ తరుణ్‌ గారు బాగా సపోర్ట్‌ చేశారు.  ఒక మంచి మూవీ చేశామని బిలీవ్‌ చేస్తున్నాం. థియేటర్స్‌ లో విూ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం. అన్నారు.

దర్శకుడు రామ్‌ భీమన మాట్లాడుతూ ` ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్‌ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్‌ లాంఛ్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్‌ మాలాంటి అప్‌ కమింగ్‌ రైటర్స్‌, డైరెక్టర్స్‌ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్‌ లో డిజైన్‌ చేసుకున్నప్పుడు పాండమిక్‌ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్‌ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్‌ రమేష్‌ గారు, ప్రకాష్‌ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్‌ తో ఈ స్టోరీ సెలెక్ట్‌ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేను. బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్‌, పీజీ విందా, మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్‌ కు యాడ్‌ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్‌ తరుణ్‌ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్‌ అయ్యా. విూరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్‌ తో రాజ్‌ తరుణ్‌ కెమిస్ట్రీ కంటే సెట్‌ లో రాజ్‌ తరణ్‌ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్‌ తరుణ్‌ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్‌ చేసే చిత్రమిది. విూకు ప్రామిస్‌ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్‌ లాంటి సినిమాను చూడబోతున్నారు. అన్నారు.

నటీనటులు ` రాజ్‌ తరుణ్‌, హాసినీ సుధీర్‌, ప్రకాష్‌ రాజ్‌, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్‌ ముత్తంశెట్టి, ముకేష్‌ ఖన్నా, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....