ఘనంగా మాజీ ప్రధాని PV నర్సింహ రావు 103 వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌ జూన్‌ 28(ఇయ్యాల తెలంగాణ )2024 భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు 103 వ జయంతి ఉత్సవాలు  హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ పీవీ మార్గ్‌ లోని జ్ఞాన్‌ భూమిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా   పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై పీవీ ని ఘనంగా స్మరించుకున్నారు.  జ్ఞాన భూమి ని సందర్శించి పీవీ నర్సింహా రావుకు ఘనంగా నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి,  హై కోర్ట్‌ జడ్జి ఔప శ్రవన్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కరే వేణుగోపాల్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య,  బీసీ కవిూషన్‌ చైర్మన్‌ కృష్ణ మోహాన్‌ రావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు పీవీ ప్రభాకర్‌ రావు, జీహెచ్‌ ఎంసీ కవిూషనర్‌ ఆమ్రపాలి కాటా,  సమాచార పౌర సంబంధాల శాఖ కవిూషనర్‌ హనుమంత రావు, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి  కోదండ రామ్‌, వీ. హనుమంత రావు, తదితరులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....