గ్రేటర్ లో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

గ్రేటర్ లో చాప కింద నీరులా విస్తరిస్తున్న  కరోనా

 


పెరుగుతున్న కేసులతో నగర ప్రజల్లో ఆందోళన
నగరంలో మరోమారు విజృంభిస్తున్న కరోనా


హైదరాబాద్‌,జూన్‌2(ఇయ్యాల తెలంగాణ): లాక్‌డౌన్‌ సడలింపులతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ పెరుగుతున్న కరోనా కేసులు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే 15 మంది చిరువ్యాపారులకు పాజిటివ్‌వచ్చింది. వీరికి ఎవరి నుంచి వ్యాప్తి అయ్యిందనే దానిపై స్పష్టత లేదు. బల్దియా అధికారులు  కాంటాక్‌ట్లు  కనిపెట్టే పనిలో పడ్డారు. కరోనా ఎఫెక్ట్‌  మొదలయిన నాటి నుంచి నిత్యావసరాల  అమ్మకాలకు పర్మిషన్స్‌ ఉన్నాయి. ప్రజలు  కూడా మార్కెట్లకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు  తీసుకుంటున్నారు. రిలాక్సేషన్స్‌ ఇచ్చాక గుంపుగా తిరగడంతో ప్రస్తుతం వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. జియాగూడ, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌ ఏరియాలకు చెందిన15 మంది కూరగాయల  వ్యాపారులకు పాజిటివ్‌వచ్చింది. ఖైరతాబాద్‌ గణెళిశ్ ‌ఏరియాలో

ఉండే వృద్ధురాలు  కూరగాయలు  అమ్ముతుంది. ఇటీవల  ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో జియాగూడలో ఉండే కూతురు, అల్లుడు వచ్చి పరామర్శించి వెళ్లారు. పరిస్థితి విషమించి నాలుగు రోజుల  కిందట ఆమె మృతి చెందింది.  టెస్టుల్లో కరోనా సోకినట్టు తేలింది.  వెంటనే కూతురు, అల్లుడికి టెస్టు చేయగా పాజిటివ్ ‌వచ్చింది. అలాగే వృద్ధురాలిని పరామర్శించిన మరో 8 మందికి వైరస్ ‌సోకినట్టు స్పష్టమైంది. మరికొందరిలో లక్షణాలు  ఉన్నట్లు తెలిసింది. వీరు ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌రోడ్‌లో తోపుడు బండ్లు పెట్టి, మరికొందరు ఇంటింటికి తిరిగి కూరగాయలు , పండ్లు అమ్ముతుంటారని తెలిసింది. ముషీరాబాద్‌ ముత్యాల  బస్తీలో ఓ కూరగాయల  వ్యాపారికి కరోనా వచ్చింది. గ్రేటర్‌ పరిధిలో ఆదివారం ఒక్కరోజే 122, సోమవారం 79 కేసులు  వచ్చాయి. కొందరు మార్కెట్లలో రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ గుమిగూడుతున్నారు. సడలింపులిచ్చారని మాస్క్ లు , ఫిజికల్‌ డిస్టెన్స్‌ను తేలికగా  తీసుకుంటున్నారు. కేసులు  భారీగా పెరగడానికి సడలింపులే కారణమని బల్దియా అధికారులు  స్పష్టం చేస్తున్నారు. బయటికెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని, లేదంటే వైరస్‌ బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. సిటీలో చాలా కేసుల్లో లింకు దొరకట్లేదు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ద్వారానే వ్యాధి విస్తరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....