గ్రూప్‌`1 రద్దు కోరుతూ హైకోర్టు లో మరో పిటిషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఇయ్యాల తెలంగాణ) :  గ్రూప్‌`1 రద్దు కోరుతూ హైకోర్టు లో మరో పిటిషన్‌ దాఖలైంది. జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌`1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా, హాల్‌?టికెట్‌ నెంబర్‌, ఫొటో లేకుండానే ూఓఖీ షీట్‌ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్‌`1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌?లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష సాఫీగా ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. టీఎస్‌పీఎస్సీ (లో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.నిబంధలను కఠినంగా అమలు చేశారు. గత గ్రూప్‌`1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....