చెరువులను నింపి రెండు పంటలకు నీరందిస్తాం
హసన్‌విూరాపూర్‌లో కాలువ పనులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,మే20(ఇయ్యాల తెలంగాణ ): ప్రజలు , రైతులంతా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరంతో గోదావరి జలాలను సిద్ధిపేట జిల్లాకు తీసుకుని వచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. దుబ్బాక మండం హసన్ విూరాపూర్ లో కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలోని
కాలువ నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వానకాలంలోపే మన ప్రాంత చెరువులు నింపుకొని రైతులు రెండు పంటలు పండిరచుకోవాలన్నదే సీఏం కేసీఆర్ ఆశయమన్నారు. ఇందుకు అనుగుణంగా స్థానిక సర్పంచ్ లు , ఏంపీటీసీలు, ఇతర ముఖ్యలు ముందుకొచ్చి పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. కాలువ నిర్మాణాలకు రైతులందరూ ఆయా ప్రాంత చెరువులు నింపుకోవాలని, ఈ ప్రాంతానికి నీళ్లు అందించేందుకు సహకరించాలని రైతులను కోరారు. దాదాపు 170 కిలో విూటర్ల ప్రయాణం తర్వాత గోదావరి జలాలు మన దుబ్బాక ప్రాంతానికి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు సాయం అందిస్తుందని, చట్ట ప్రకారంగా రావాల్సిన ప్రతి పైసా రైతులకు త్వరితగతిన చెల్లిస్తామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. పెద్దగుండవెళ్లి కాలువ ప్రధానమైన కాలువతో పాటు హసన్ విూరాపూర్, చింతమడక, అంకంపేట, నారాయణరావుపేట గ్రామాల్లో పారే కాలువ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. హసన్ విూరాపూర్, పెద్ద గుండవెళ్లి చౌద చెరువు, దుంపపల్లి పెద్ద చెరువు, దుబ్బాకలోని నల్ల చెరువు, రామ సముద్రం, ధర్మాజీపేటలోని పెద్ద చెరువు, చిట్టాపూర్ పెద్ద చెరువులను ప్రధానమైన పెద్ద చెరువులన్నీ ఈ కాలువ ద్వారా నిండుతాయని మంత్రి పేర్కొన్నారు. హసన్ విూరాపూర్, పెద్ద గుండవెళ్లి, చింత మడక, మాచాపూర్, చెల్లాపూర్, రాజక్కపేట, ముస్తాబాద్ మండం బదనకల్, మోయిని కుంట గ్రామాల్లోని 13 వే ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. సిద్ధిపేట రూరల్, దుబ్బాక, ముస్తాబాద్ మూడు మండలాలు , 8 గ్రామాల్లో ఈ కాలువ ప్రవహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ ఆనంద్, డీఈ రవీందర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు
మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం క త్వరలోనే నెరవేరనుందన్నారు. కేసీఆర్ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్‌రావు తెలిపారు. సమైక్య పాలకుల కుట్ర వల్లే మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మించడం సాధ్యం కాలేదన్నారు. జిల్లాలోని హవెలి ఘన్‌పూర్ మండం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇవాళ సర్దన వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ డ్యామ్ ఐదు గ్రామా ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పాపన్నపేటలో మూడు గ్రామాలు, ఘనపురం మండలంలో రెండు గ్రామాల రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మాణం జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని మంత్రి గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఫసల్వాది గ్రామం నుంచి చివరన సర్దన వరకు ఈ పదిహేను డ్యామ్ ల నిర్మాణం జరుగుతుందన్నారు. మంజీరా నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హరీష్‌రావు స్పష్టం చేశారు. 25 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. కొండపోచమ్మ సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయి. అక్కడి నుంచి సర్దన చెక్‌డ్యామ్, కూచనపల్లి చెక్‌డ్యామ్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. బొల్లారం మత్తడి కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వొచ్చు అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదదితయి పాల్గొన్నారు.