గురుగ్రాం హింసాకాండ : ఢిల్లీలో హైఅలర్ట్‌

మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 116 మందిని అరెస్ట్‌

న్యూఢిల్లీ, ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): హరియాణాలోని నుప్‌ాలో వీహెచ్‌పీ ప్రదర్శన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 116 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలపై మంగళవారం ఏకంగా 41 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. హరియాణ అల్లర్లలో ఇమాం సహా ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు గురుగ్రాంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగడంతో ఢల్లీి సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) అప్రమత్తమైంది. గురుగ్రాంలోని సోహ్న సబ్‌డివిజన్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్ధలకు బుధవారం సెలవు ప్రకటించారు. అలజడి నెలకొనకుండా భారీ సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు.నుప్‌ా ఘర్షణలకు వ్యతిరేకంగా ఢల్లీిలోని నిర్మాణ్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ వద్ద నిరసనలకు వీహెచ్‌పీ పిలుపు ఇవ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణ హింసాకాండకు వ్యతిరేకంగా మనేసర్‌లోని బిసం దాస్‌ మందిర్‌లో బుధవారం సాయంత్రం మహాపంచాయత్‌కు వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ పిలుపు ఇచ్చాయి. నోయిడాలో భారీ ప్రదర్శన చేపట్టేందుకు హిందూ సంస్ధలు సన్నద్ధమయ్యాయి, నోయిడా స్టేడియం నుంచి ప్రారంభమయ్యే నిరసన ప్రదర్శన రజనిగంధ చౌక్‌ వద్ద ముగుస్తుందని వీహెచ్‌పీ ప్రచార కమిటీ చీఫ్‌ రాహుల్‌ దూబే వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....