గాంధీలో కరోనాకు ప్లాస్మీ థెరఫీ

గాంధీలో కరోనాకు ప్లాస్మీ థెరఫీ


ఐసిఎంఆర్‌ సూచన మేరకు చికిత్సలు


రంగం సిద్దం చేసిన ఆస్పత్రి వైద్యులు 



హైదరాబాద్‌, మే 12 (ఇయ్యాల తెలంగాణ):  కోవిడ్‌`19 ఆసుపత్రి గాంధీలో ప్లాస్మా థెరఫీకి రంగం సిద్దమయ్యింది. ఐసిఎంఆర్‌ సూచన మేరకు ఇక్కడ వైద్యం అందించనున్నారు.  కరోనా వైద్యం కోసమే ప్రత్యేకంగా కేటాయించిన గాంధీ ఆసుపత్రిలో  కరోనా మహమ్మారికి చికిత్సలో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీని మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి పొందింది. కరోనా బారిన పడి వైద్యసేవల  అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న 35 మంది ప్లాస్మా దాతలు   ముందుకురాగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న 15మంది నుంచి ప్లాస్మా కణాలను సేకరించారు. వారిలో ఆరుగురు కరోనా బాధితుల కేస్‌ సీట్లు ఇతర వివరాను ఐసీఎంఆర్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి విడతగా ముగ్గురికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభిస్తారు. ఆరోగ్యవంతుడైన కరోనా బాధితుల  నుంచి 400 ఎం.ఎల్‌ ప్లాస్మాను సేకరించి 200 ఎం.ఎల్‌ ప్లాస్మాను బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ పక్రియకు సుమారు 2 గంట సమయం పడుతుంది. ప్లాస్మా థెరపీతో రోగి కోలుకుంటున్నట్లు భావిస్తే మరో 200 ఎం.ఎల్‌ ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇటు దేశవ్యాప్తంగా పలు  ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సల , పనితీరుపై ఐసీఎంఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీసి పలు  సలహాలు  సూచనలు  అందిస్తోంది. గాంధీలో చేపట్టే ప్లాస్మా ` థెరపీ చికిత్సను అనుక్షణం ఐసీఎంఆర్‌ నిపుణు పర్యవేక్షించనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....