హైదరాబాద్, మార్చి 21 (ఇయ్యాల తెలంగాణ) : గర్భిణీ మహిళలకు పోషణ కలిగిన వంటకాలు అందేలా అత్యంత కృషి చేస్తుంది. గర్భిణీ మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహరం అవసరం గురించి అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలలో, స్థానిక కమ్యూనిటీ హాల్ లలో ICDS అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లతో కూడిన ప్రతినిధుల బృందం అనేక చోట్ల గర్భిణీ మహిళలకు పోషక విలువలపై అవగాహన కల్పించడంతో పాటు పోషక ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోషక ఆహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సనేహర CDPO జయశ్రీ ANM ఆర్. అనిత అంగన్వాడీ టీచర్లు మంజుల, డి.నిర్మల, గీత శ్రీవాస్తవ్, సత్యవతి ఆశ లు జి. లత, కె. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ మహిళలకు పోషణ – పోషక ఆహారం (Food) ఏంతో ముఖ్యం
Leave a Comment