👉 గత పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో విఫలం
👉 మహిళా సంఘాలకు ఎనిమిది సంవత్సరాలుగా పావుల వడ్డీ రుణాలు లేవు
👉 అభివృద్ధి చేస్తున్న బిజెపిని చూసి ఓర్వలేకనే బిజెపిపై లేనిపోని ఆరోపణలు
👉 రామరాజ్య స్థాపనకు మనమంతా కృషి చేద్దాం
👉 నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
కోరుట్ల , ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : పసుపు రైతుల పునర్ వైభవం మోదీతోనే సాధ్యమవుతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆన్నారు..గురువారం కోరుట్ల పట్టణ పద్మశాలి భవనంలో కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించగాఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ హజరై ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో విఫలమైనందున గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితను ఓడిరచేందుకు 179 మంది రైతులు నామినేషన్ వేసి 93 వేల ఓట్లను సంపాదించారన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు గడ్డపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన చేయడం జరిగిందన్నారు.. గతంలో పసుపు ధర బంగారంతో పోటీపడేదని గడిచిన ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల పసుపు ధర తగ్గడం వల్ల చాలామంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు చెరుకు ఫ్యాక్టరీ మూతపడటం వల్ల ఈ ప్రాంతంలో చెరుకు సాగు తగ్గించి వరి సాగు చేపట్టారని వరి సాగు పెరగడం వల్ల బాయిల్డ్ రైస్ మిల్లులు అధికమయ్యాయని గతంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరిగేదని ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా వరి సాగు చేయడం వలన ఎగుమతి తగ్గి బాయిల్డ్ రైస్ కు ప్రాధాన్యత లేకుండా పోయిందని దానివలన బాయిల్డ్ రైస్ ను కేంద్ర ప్రభుత్వం కొనలేదని చెప్పినా గత రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లలతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే కాకుండా రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిరదన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుందని కొట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ అని గతంలో పసుపు రేటుకు ప్రస్తుత పసుపు రేటుకు ప్రజలు గమనించాలని కోరారు.. గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏవిూ లేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ అమలు సరిగా లేదని మన దేవుళ్ల పేర్లను పథకాలకు పెడుతున్నారు.. కానీ రాముడి గుడి కడదామంటే కోర్టుకు వెళ్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్లు ఇదేంటని ప్రశ్నించండి ఈ జిల్లా మంత్రిగా గతంలో చేసింది ఏవిూ లేదని బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్లు మాటలు విని రైతులు మోసపోయారన్నారు. పసుపు బోర్డు ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న నాయకుడు మోడీ అన్నారు… పసుపు రైతుల పునర్ వైభవం మోదీతోనే సాధ్యమవుతుందన్నారు అభివృద్ధి చేస్తున్న బిజెపిని చూసి ఓర్వలేకనే ఈ పార్టీల నాయకులు బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దేశంలో పసుపు విస్తీర్ణం పెరిగిందన్నారు దీనికి అనుకూలంగా పసుపు ఎగుమతులు సైతం పెరిగాయి అన్నారు.. తెలంగాణలో చేతకాని పార్టీలు ఉన్నాయి అందుకే పసుపు విస్తీర్ణం తెలంగాణలో తగ్గిందన్నారు.. అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరు గ్యారెంటీ లకు గతి లేదన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ ఎక్కడ అని ప్రశ్నించారు.. మహిళా సంఘాలకు ఎనిమిది సంవత్సరాలుగా పావుల వడ్డీ రుణాలు లేవన్నారు.. మోడీ ప్రభుత్వం మహిళా సంఘాలకు సబ్సిడీ రుణాలు అందజేస్తుందని హావిూలు నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.. రైతు బంధువులు కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో అందిస్తున్న ఘనత కాంగ్రెస్ వాళ్లది అన్నారు బిజెపి వాళ్లంతా వాలంటీర్ గా మోడీకి పనిచేస్తున్నారని అన్నారు నేను అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళద్దాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు మేము ప్రజలను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటున్నామని మన కర్తవ్యం మనం చేద్దామని బూత్ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు కృషి చేద్దామన్నారు.. రామరాజ్య స్థాపనకు మనమంతా కృషి చేద్దామని కోరారు.. ప్రపంచ దేశాలు మోడీని చూసి ఆశ్చర్యపోతూ సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలలో హిందూ దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారని కనీసం దానిని చూసిన ఈ నాయకులు మోడీ గురించి మాట్లాడడం మానుకోవాలన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడమే కాకుండా రామరాజ్య స్థాపనకు మోడీ కృషి చేస్తున్నారని ఆయనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మోడీ గురించి మాట్లాడడం సరికాదన్నారు. అయోధ్యలో జరిగిన రామ మందిని నిర్మాణాన్ని చూస్తే ఒక అద్భుత కట్టడం అలాంటిది మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందన్నారు ఈనెల 26న జగిత్యాల జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ఇట్టి బస్సు యాత్రను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, పార్లమెంటు ప్రబారి వెంకటరమణి, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమయ్య ,పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివ్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దం గంగారెడ్డి, కార్యదర్శి పిసరి నర్సయ్య ,ఎర్ర లక్ష్మి, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు మన్నె గంగాధర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధులు ఇందూరి తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల రంజిత్ ,ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికెల నవీన్, కౌన్సిలర్లు సుఖేందర్, మాడవేణి నరేష్, పెండం గణేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, నాయకులు జక్కుల జగదీశ్వర్, ఆకుల లింగారెడ్డి, నీలి గాయత్రి, బీజేపీ పార్టీ వివిధ మండల పట్టణ అధ్యక్షులు, వివిధ హోదాల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు