గండిపోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద

దేవీపట్నం, జులై 19 (ఇయ్యాల తెలంగాణ) : అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద భారీగా వచ్చి చేరింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో బుధవారం ఉదయానికి గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. దీంతో ఆలయంలో దర్శనాలను దేవాదాయశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ సవిూపంలోని స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....