క్షేత్రపరిధిలో వివిధ ప్రదేశాలను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి !

 

శ్రీశైలం, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారివారు బాహ్యవలయరహదారి (ఔటర్‌ రింగురోడ్డు) పరిసరప్రాంతాలు, యాంఫీథియేటర్‌, సారంగధరమఠం తదితర వాటిని ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాదికారివారు మాట్లాడుతూ వలయరహదారిలోని చుట్టు పక్కల గల పిచ్చిమొక్కలను, బండరాళ్ళను తదితర వ్యర్థాలను తొలగించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా యాంపిథియేటర్‌ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా పరిసరాలలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను, వ్యర్థాలను తొలగించాలని పారిశుద్ధ్నపు అధికారులను ఆదేశించారు. సారంగధరమఠం వద్ద వర్షపు నీటితో పాటు కొట్టుకువచ్చే వ్యర్థాలు, గుండాలలో కలవకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గుండాలలో వ్యర్థాలు కలవకుండా ఉండేందుకు గుండాలచుట్టూ సిమెంట్‌ గట్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని బాహ్యవలయరహదారిలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని భద్రతావిభాగాన్ని ఆదేశించారు. ఈ విషయములో స్థానిక పోలీసుశాఖవారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. బాహ్యవలయరహదారి విభాగిణిలలో సెంట్రల్‌ విూడియన్స్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు (ఐసి) పి.చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....