కోర్టు పర్మిషన్‌ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా?

అబార్షన్‌ కేసులు సీరియస్‌ ఐన సుప్రీంకోర్టులో సీజే DY చంద్రచూడ్‌

న్యూఢల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ): సుప్రీంకోర్టులో ఇవాళ సీజే డీవై చంద్రచూడ్‌ ఓ కేసులో సీరియస్‌ అయ్యారు. 26 వారాల ప్రెగ్నెంట్‌ పెట్టుకున్న అభ్యర్థన కేసులో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పెట్టుకున్న రిక్వెస్ట్‌పై స్పందిస్తూ.. కోర్టు ఆర్డర్‌ ద్వారా పర్మిషన్‌ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ఈ కేసులో శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టనున్నారు.అబార్షన్‌ అపీల్‌ గురించి ఆ మహిళతో కేంద్రం తరపున లాయర్‌ మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళా సుప్రీంలో పిటీషన్‌ వేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. మానసికంగా, ఆర్థికంగా మూడవ శిశువును పెంచే స్థితిలో తాను లేనట్లు ఆమె ఆ పిటీషన్‌లో తెలిపింది.ఈ కేసులో అబార్షన్‌కు అనుమతి ఇస్తూ అక్టోబర్‌ 9వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎయిమ్స్‌ వైద్యుల బృందం మాత్రం అబార్షన్‌కు నిరాకరించారు. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఆ కేసును ఇవాళ సీజే చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టేకప్‌ చేసింది. రేపు మళ్లీ తీర్పు ఇవ్వనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....