కొత్త జడ్జీలు నియామకం

విజయవాడ, అక్టోబరు 21, (ఇయ్యాల తెలంగాణ );ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్‌ నూనెపల్లి, సుమతి జగడం, మండవ కిరణ్మయి, న్యాపతి విజయ్‌ శనివారి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, ఇతర న్యాయమూర్తులు, సీఎం జగన్‌, హోంమంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయ శాఖ వీరి నియామకానికి ఈ నెల 18న ఉత్తర్వులిచ్చింది.ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు ప్రస్తుతం 27 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్‌ నరేందర్‌ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరింది.న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి ముందు ఏపీ సీఎం జగన్‌, గవర్నర్‌ నజీర్‌ తో రాజ్‌ భవన్‌ లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, నవంబర్‌ 1న వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్‌ ను సీఎం ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....