కొండగట్టు అంజన్న సన్నిధిలో AP డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్‌ !

జగిత్యాల, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శిం చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆల యంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చేసేందుకు స్థాని కులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉద యం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమా నులు ఘనస్వాగతం పలికారు. 

ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమాను లు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులి చ్చారు. అనంతరం అభి మానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వచ్చారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేప  ట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించ నున్నారు.  ఈ క్రమంలోనే తమ ఇల వేల్పు అయిన కొండగట్టు ఆంజ నేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కాగా, గత ఏడాది ఎన్నికల కు ముందు ప్రచారం మొద లుపెట్టిన పవన్‌ కల్యాణ్‌. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....