కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

సోమాజిగూడ, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి ముంజగళ్ళ విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళ వారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ అనాలోచితంగా మాట్లాడిన మాటలు కావనీ, ఆ మాటల వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దళిత వర్గాలే ఈ రాష్టాన్ని ఏలుతారని గ్రహించి జీర్ణించుకోలేక అక్కసుతో కేసీఆర్ మాట్లాడిన మాటలని ఆయన అన్నారు. దళిత బలహీన వర్గాల వారు చదువులకు దూరమవ్వాలని, మళ్ళి ఈ దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని పాటించే విధంగా కుట్రలు పన్నుతు నరేంద్రమోదీ కి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నిన కుట్రలను రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ నాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, గుడిసె దేవానంద్ నేషనల్ ప్రెసిడెంట్, భరత్ వాగ్మారే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇందర కుమార్ స్టేట్ జనరల్ సెక్రటరీ, తలారి గోపాల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, షర్మిల స్టేట్ మహిళా అధ్యక్షురాలు, నారయణ్ నాయక్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, మురారి, రాములు, ఆంజనేయులు, రాజయ్య, ప్రభాకర్, అశోక్, సురేష్, బబ్లు, విఠల్ తదతరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....