కేసీఆర్‌ గడీలు బద్దలు కొడతాం

`తెలంగాణలో కాషాయ రాజ్యం స్థాపిస్తాం

`దిపార్టీ నాకు ఎన్నో అవకాశాలిచ్చిం

`బీజేపీకి రుణపడి ఉంటా

`ఎంపీగా చేసిన కరీంనగర్‌ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా

`కేసీఆర్‌ కు … మోదీ వస్తే జ్వరమొస్తది

`బండి సంజయ్‌ భావోద్వేగ ప్రసంగం

` మోదీ…. బండి మేనియాతో ఉర్రూతలూగిన ఓరుగల్లు బహిరంగ సభ

వరంగల్‌ జులై 8, (ఇయ్యాల తెలంగాణ ):బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ భావోద్వేగ ప్రసంగంతో యావత్‌ ప్రజలను ఆకట్టుకున్నారు. మాట్లాడిరది 5 నిమిషాలే అయినా… నోటి నుండి వచ్చిన ప్రతి పదాన్ని బహిరంగ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆస్వాదించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు ఎన్నో అవకాశాలిచ్చిన బీజేపీకి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటిస్తూ… పార్టీపట్ల తనకున్న నిబద్దతను చాటుకున్నారు. అదే సమయంలో 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇస్తూ ప్రపంచమే ది బాస్‌ అంటూ కొనియాడే ప్రధాని నరేంద్రమోదీ భుజం తడితే ఎట్లుంటదో… తన భుజాన్ని అడిగితే తెలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై ధీటుగా ప్రతిస్పందించారు. 6 వేల 100 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు తెస్తున్నందుకు మోదీ వచ్చారు.. వరంగల్‌ కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెస్తున్నందుకు వచ్చారు. స్మార్ట్‌ సిటీ నిధులు ఇచ్చినందుకు… కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసినందుకు, టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చారు’’అంటూ వ్యాఖ్యానించారు. మరి సీఎం ఇక్కడికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలపట్ల చిత్తశుద్ధి, అభివ్రుద్ధి పట్ల కాంక్ష ఉంటే ఇక్కడికి వచ్చి మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మోదీ వద్దకు రావడానికి కేసీఆర్‌ కు ముఖం చెల్లడం లేదని, ఆయనను చూస్తేనే కేసీఆర్‌ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు.

 మోదీ ది బాస్‌…. ప్రపంచమే పాదాభివందనం చేస్తున్న మహానుభావుడు ఈ ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం. 6 వేల 100 కోట్ల నిధులుతో అభివ్రుద్ది పనులకు ముఖ్యంగా కరీంనగర్‌ ?వరంగల్‌ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు. కొంతమంది ఏ ముఖం పెట్టుకుని మోదీ వచ్చారని అడుగుతున్నారు… 6 వేల 100 కోట్ల నిధులతో అభివ్రుద్ది పనుల ప్రారంభించేందుకు వచ్చారు… రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు వచ్చారు… స్మార్ట్‌ సిటీ నిధులిచ్చినందుకు వచ్చారని అన్నారు.కేసీఆర్‌…..మోదీ నీ దోస్త్‌ అన్నవ్‌ కదా? నువ్వెందుకు రాలేదు? రావడానికి నీకు ముఖం లేదు… నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ, అభివ్రుద్ధి ఉంటే ఇక్కడికి రావాలి కదా… మోదీ వస్తే కేసీఆర్‌ కు కోవిడ్‌ వస్తది… బిజీ అయితడు. నరేంద్రమోదీకి ప్రజలంతా లేచి చప్పట్లు కొట్టాలి…(అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు)… విూరు జై మోదీ అనే నినాదాలతో కేసీఆర్‌ చెవుల నుండి రక్తం కారాలని అన్నారు.సాధారణ కార్యకర్తగా ఉన్న నన్ను అర్బన్‌ డైరెక్టర్‌ గా, కార్పొరేటర్‌ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిన బీజేపీకి రుణపడి ఉంటా…శిరస్సు వంచి దండాలు పెడుతున్నానని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....