కేజ్రీవాల్‌, సిసోడియా, కవితల జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించిన Delhi కోర్టు

న్యూఢిల్లీ, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :  ఎక్సైజ్‌ స్కామ్‌ తాలూకు మనీ లాండరింగ్‌, అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  జ్యుడీషియల్‌ కస్టడీని గురువారం పొడిగించింది. ఈడి దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్‌ కేసులో జులై 31 వరకు, సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ కస్టడీని ప్రత్యేక జడ్జీ కావేరి బవేజా పొడగించారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి  మనీశ్‌ సిసోడియా, బిఆర్‌ఎస్‌ నాయకురాలు కె. కవిత , ఇతర నిందితుల జ్యడీషియల్‌ కస్టడీని కూడా జడ్జీ జులై 31 వరకు పొడగించారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టు ఇదివరలో ఈడి కేసులో కేజ్రీవాల్‌ కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. అయినా ఆయన ఇప్పటికీ తీహార్‌ జైలులో ఉన్నారు. కారణం ఆయన కేసులో బెయిల్‌ బాండ్‌ సమర్పించలేదు. ఆయన సిబిఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....