హైదరాబాద్, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని హైదరాబాద్ టిఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్చార్జ్ పుస్తే శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు గురువారం పురాణాపూల్ చౌరస్తాలో టిఆర్ఎస్ శ్రేణులతో కలసి పుస్తే శ్రీకాంత్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలను వేంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరల వల్ల సామాన్య ప్రజల జివితాలపై భారం అధికమవుతుందని అన్నారు. ఇప్పటికే లాక్ డౌన్ పరిస్థితుల నుండి బయట పడుతున్న ప్రజలకు భారంగా మారే ధరలు పెంచడం న్యాయం కాదన్నారు. పెంచిన ధరలు వెంటనే దించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఈ సందర్భంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు విష్ణు గౌడ్, అరుణ్ కాంత్, ఇలీయాజ్ కురేషి, మంజుల, మల్లీఖార్జున్ యాదవ్, రాధా క్రీష్ణ, గోపి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- General News
- కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : పుస్తే శ్రీకాంత్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : పుస్తే శ్రీకాంత్
Leave a Comment