కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తో M P ఈటల భేటీ

    

డిల్లీ. జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ ) నితిన్‌ గడ్కారీ కలిసి మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం, తెలంగాణలో ఉన్న సమస్యలను  ఎంపీ ఈటల రాజేందర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌ లో విూడియాతో మాట్లాడుతూ  కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్‌ పాస్‌,  నత్తనడక నడుస్తున్న ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌, శావిూర్‌ పేట రోడ్డు, ఎల్బీ  నగర్‌ అండర్‌ పాస్‌, హుజూరాబాద్‌ రోడ్డు సమస్యలపై చర్చించాము.  హైదరాబాద్‌ లో నిర్మించేవి అన్నీ అండర్‌ పాస్‌ లు కాకుండా ఫ్లై ఓవర్‌ లు నిర్మించాలని కోరాము.  హుజూరాబాద్‌ లో సింగాపూర్‌, రాంపూర్‌, రంగాపూర్‌, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాం.  సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....