రంగారెడ్డి, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) :ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ లో నూతన ఫ్లయిఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణంలో వున్న ప్లై ఓవర్ కుప్పకూలింది. ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ,ఆస్పత్రికి తరలించారు. ఘటన అర్ధ రాత్రి ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ కూలిపోయిన ప్రాంతాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. తరువాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటన లొ ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తాం. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తాం. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్య మందేలా మాట్లాడుతున్నానని అన్నారు.
క్షతగాత్రులు యుపి కి చెందిన రోహిత్ కుమార్(25), పునీత్ కుమార్ (25), శంకర్ లాల్(25), రవికుమార్(26), బీహార్ కు చెందిన జితేందర్ కుమార్(26), హరేరామ్(22), విక్కి కుమార్(23), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంజనీర్ గోపాల కృష్ణ(29).