కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం

 

హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్‌ పొలిటికల్‌ ఫోరమ్‌ (హెచ్‌ఎల్‌పిఎఫ్‌)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కార్యనిర్వాహక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. గ్లోబల్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (ఙఔచిుూ) ఆయనకు ఆహ్వానం పంపింది.ఈ ఏడాది జూన్‌ 21, 22 తేదీల్లో గోవాలో జరిగిన జీ 20 పర్యాటక మంత్రుల సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందడం విశేషం. ఈ సమావేశానికి కిషన్‌ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం,  దేశాలు, వాటాదారుల మధ్య భాగస్వామ్యం, సహకారాల పెంపుకు జీ 20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ‘ఇండియా డిక్లరేషన్‌, గోవా రోడ్‌ మ్యాప్‌’ అమలుపై ఐక్యరాజ్యసమితిలో ఆయన మాట్లాడనున్నారు. కాగా హెచ్‌ఎల్‌పీఎఫ్‌ నుంచి ఈ ఆహ్వానాన్ని అందుకున్న తొలి భారతీయ పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి కావడం విశేషం.కోవిడ్‌`19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలలో టూరిజం పాత్రను గుర్తిస్తూ ఙఔచిుూలో నిర్వహించే సమావేశంలో చర్చలు జరగనున్నాయి. పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడంపై అగ్ర దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఒకే చోటకు చేర్చనున్నారు. ఈ ఈవెంట్‌ ద్వారా టూరిజం, ఎస్‌డీజీల మధ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనున్నారు.కాగా ‘కరోనావైరస్‌ వ్యాధి ప్రభావాలను వేగవంతంగా పరిష్కరించడం, అన్ని స్థాయిల్లో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడంపై తీసుకోవల్సిన చర్యలు, విధివిధానాలు’ అనే అంశంపై హెచ్‌ఎల్‌పీఎఫ్‌`2023 ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఫోరమ్‌లో పాల్గొనే నేతలు, వ్యాపారులు అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై మాట్లాడనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....