కింగ్‌ నాగార్జున నా సామిరంగ’ `2024 సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌

 
ఆగష్టు 29(ఇయ్యాల తెలంగాణ ); కింగ్‌ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఆనందపరిచే విధంగా ఆయన కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన పాపులర్‌  కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని మాస్‌ జాతరగా రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రిచ్‌  ప్రొడక్షన్‌ డిజైన్‌, అత్యుత్తమ టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ తో రూపొందనున్న ఈ సినిమాను అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు.నాగార్జున కు అనేక చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌లను అందించి ఆస్కార్‌, జాతీయ అవార్డును గెలుచుకున్న లెజెండరీ కంపోజర్‌ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. బ్లాక్‌ బస్టర్‌ రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి కథ,  డైలాగ్స్‌ అందించారు.  ఇందులో విభిన్న క్రాఫ్ట్‌ లలో పాపులర్‌  సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.మేకర్స్‌ మరో సర్‌ ప్రైజ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతుంది. సినిమాల విడుదలకు సంక్రాంతి చాలా పెద్ద సీజన్‌, అలాగే ఈ పండుగకు అనేక హిట్‌లు సాధించిన నాగార్జునకు ఇది మోస్ట్‌ ఫేవరేట్‌ సీజన్‌. ఇది అక్కినేని అభిమానులకు నిజమైన పండుగ కానుంది. పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ వినోదాత్మక సినిమాకే ఉంటుంది.తారాగణం: కింగ్‌ నాగార్జున అక్కినేని, కరుణ కుమార్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....