కాసులు కురిపిస్తున్న కురులు

తిరుమల, ఆగస్టు 14, (ఇయ్యాల తెలంగాణ ); ఆపదమొక్కుల స్వామి శ్రీ వెంకటేశ్వరుడి కి తలనీలాలు సమర్పించడం భక్తుల మొక్కులో ఒక భాగం. కోరుకున్న మొక్కులు తీరగానే తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తిరుమల కొండలు అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటుండంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టీటీడీ కళ్యాణకట్ట తో పాటు చాలా ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఇలా గుండు కొట్టి గోవిందుడి మొక్కు తీర్చుతున్న భక్తుడి ఆదాయం ఏటా టీటీడీ కి రూ. 120 కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా గత ఐదారేళ్లుగా టీటీడీకి తలనీలాల ఆదాయం అంతకంతకు పెరిగి ఈ ఏడాది మరో రికార్డు ను నమోదు చేయబోతోంది. ఇప్పటిదాకా ఏటా రూ.120 కోట్లు వస్తోందని టీటీడీ లెక్కలు చెబుతుండగా ఈ ఏడాది రూ. 150 కోట్లుకు పైనే ఉండబోతోంది.ప్రతి ఏడాది నాలుగు సార్లు ఈ ఆక్షన్‌ నిర్వహిస్తున్న టీటీడీ తలనీలాలను గ్రేడులు వారీగా విభజించి ఈ ఆక్షన్‌ నిర్వహిస్తోంది. 5 గ్రేడులుగా విభజించి తలనీలాలను వేలం వేస్తున్న టీటీడీ మొదటి మూడు గ్రేడ్‌ లలో డై, బ్లాక్‌ హెయిర్‌ ను వేరుచేసి రెండు రకాలుగా విభజిస్తుంది.

తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ గౌడన్‌ లో భక్తుల తలనీలాల గ్రేడిరగ్‌ ప్రక్రియ చేపడుతున్న టీటీడీ తిరుమల నుంచి ఒక రోజుకు 1400 కేజీల తలనీలాలను సేకరిస్తోంది. తిరుమలలోని టీటీడీ కళ్యాణ కట్ట, గెస్ట్‌ హౌస్‌ లో తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసిన టిటిడి తలనీలాలు సేకరణలో పలు జాగ్రత్తలు కూడా పాటిస్తోంది. మొక్కులో భాగంగా భక్తులు సమర్పించే తలనీలాలు రోజూ తడిగా ఉండే 1400 కేజీలు కాగా తలనీలాలు డ్రై అయ్యాక ఒకమెట్రిక్‌ టన్ను వరకు టిటిడి గోడౌన్‌ కు చేరుతుంది. కరోనా తర్వాత శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగానే తలనీలాల ఆదాయం టీటీడీ కి విపరీతంగా పెరిగింది. ఐదారేళ్ళుగా ఏటా రూ. 120 కోట్లకు పైగా టిటిడి కి ఆదాయం వస్తుండగా 2022`23 ఆర్థిక సంవత్సరానికి రూ.120 కోట్లు ఆలయం టిటిడి కి వచ్చింది. ఇక 2023`24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు రెండుసార్లు ఈ ఆక్షన్‌ నిర్వహించిన టీటీడీ ఇప్పటివరకు దాదాపు రూ.105 కోట్ల మేర ఆదాయం పొందింది. మరో రెండు సార్లు ఈ ఆక్షన్‌ నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతుండగా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం ఏకంగా రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో భక్తులు సమర్పించే కురులు శ్రీవారి హుండీ ఆదాయానికి కాసులను కురిపిస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....