కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల  హతం.

శ్రీనగర్‌,మే19(ఇయ్యాల తెలంగాణ ): జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు  మట్టబెట్టాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు  దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు , సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు సంయుక్త సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు  దాగి ఉన్న ప్రాంతాన్ని భధ్రతా బలగాలు  చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు  కాల్పులకు  తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు  ఎదురు కాల్పులు  జరిపారు. ఈ కాల్పుల్లో  హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతోపాటు కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడి కొడుకు కూడా మృతి చెందాడు. భద్రతా బలగాలు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మరణించగా.. ఒక పోలీస్‌ అధికారి, ఓ జవానుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....