కాంతర’ వేషంలో అలరించిన తహసిల్దార్‌ – ప్రశంసించిన జిల్లా కలెక్టర్‌

విజయనగరం , నవంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ) : ఆయనో తహసీల్దార్‌…  కళలంటే ఆయనకు ఎనలేని అభిమానం. అవకాశం దొరికితే తనలో ఉన్న కళను ప్రదర్శించిన పదుగురిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ఆయనే కొత్తవలస తహసీల్దార్‌ డి.ప్రసాదరావు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్‌ డూపర్‌ హిట్‌ తమిళ డబ్బింగ్‌ చిత్రం కాంతారలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్‌ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు.గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రెవెన్యూ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ విూట్‌లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్‌ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్‌ అయి అలరించారు. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టర్‌ ఢల్లీిరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....