కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ED కేసు.. నాలుగు కార్లు, నగలు, నగదు సీజ్‌

 

న్యూఢల్లీ  జూలై 31, (ఇయ్యాల తెలంగాణ ):  హర్యానా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చొక్కర్‌తో పాటు అతని కంపెనీలకు చెందిన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్‌ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. అయితే ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలుగు లగ్జరీ కార్లతో పాటు 14.5 లక్షల విలువైన జ్వలరీ, 5 లక్షల నగదును ఈడీ సీజ్‌ చేసింది. ఇండ్ల కొనుగోలుదారులన మోసం చేసినట్లు ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి.ధరమ్‌ చోకర్‌ కుటుంబానికి చెందిన సభ్యులు సాయి అయినా ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నడుపుతున్నారు. దాంట్లో మహిరా ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ కూడా ఉంది. సామల్కా, గురుగ్రామ్‌, ఢల్లీి నగరాల్లో ఈడీ తనిఖీలు చేసింది. 1497 మంది కొనుగోలుదారుల నుంచి సుమారు 360 కోట్లు వసూల్‌ చేసినట్లు సాయి అయినా ఫార్మ్స్‌ కంపెనీపై గురుగ్రామ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.తనిఖీల సమయంలో చోకర్‌ కుటుంబసభ్యులు దర్యాప్తులో పాల్గొనలేదని ఈడీ పేర్కొన్నది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....