కశ్మీర్‌ కు వందేభారత్‌

న్యూఢల్లీ, అక్టోబరు 20, (ఇయ్యలతెలంగాణ ); కశ్మీర్‌లోనూ త్వరలోనే వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇదే విషయం వెల్లడిరచారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము `శ్రీనగర్‌ లైన్‌లో వందేభారత్‌ ట్రైన్‌ సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెవిూ హై స్పీడ్‌ ట్రైన్స్‌ని నడిపే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి రైల్వే లైన్‌ కన్‌ఫమ్‌ కాగానే వెంటనే ఈ ట్రైన్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్‌ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్స్‌నీ అందుబాటులోకి తీసుకురానుంది. జమ్ము`శ్రీనగర్‌ రైల్వే లైన్‌ క్లియర్‌ అయిన వెంటనే వందేభార్‌ ట్రైన్‌ని నడుపుతామని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్‌. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఇది పూర్తవుతుందని చెప్పారు. కశ్మీర్‌లోని వాతావరణానికి తగ్గట్టుగా రైళ్లని డిజైన్‌ చేస్తామని వైష్ణవ్‌ వెల్లడిరచారు. ఇప్పటికే యువత, వృద్ధుల్లో వందేభారత్‌ ట్రైన్‌కి మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే..ఇకపైనా వీటి సంఖ్య పెంచాలని భావిస్తోంది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తేల్చి చెప్పారు. కాషాయ రంగువేయడం వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా అన్న విూడియా ప్రశ్నలకు ఈ సమాధానమిచ్చారు. కేవలం శాస్త్రీయంగా ఆలోచించి ఈ రంగు వేశామే తప్ప..రాజకీయ ఉద్దేశాలేవిూ లేవని స్పష్టం చేశారు. కంటికి బాగా కనిపించే రంగు కావడం వల్లే ఆరెంజ్‌ కలర్‌ని ఎంపిక చేసినట్టు వివరించారు. కేరళలో సెప్టెంబర్‌ 24వ తేదీన కసరగడ్‌ నుంచి తిరువనంతపురం వరకూ కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి వచ్చింది. కాషాయ రంగులో ఉన్న ట్రైన్‌ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఒకేసారి 9 వందేభారత్‌ ట్రైన్స్‌ని ప్రారంభించారు. అయితే…ఆరెంజ్‌ కలర్‌ వేయడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వాళ్లూ సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెట్టారు. పార్టీ రంగునే ట్రైన్‌లకు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే…అశ్వినీ వైష్ణవ్‌ క్లారిటీ ఇచ్చారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, షిప్స్‌లో కీలకంగా భావించే పశ్రీజీఞస పనీలీ లకూ ఆరెంజ్‌ కలర్‌ వేస్తారని, అవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయన్న కారణంతోనే అలా తయారు చేస్తారని వివరించారు.ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దు. ఇది 100 సైంటిఫిక్‌గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సాధారణంగా మన కళ్లకి పసుపు, కాషాయ రంగుల విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐరోపాలో దాదాపు 80% రైళ్లకి ఆరెంజ్‌, ఎల్లో కాంబినేషన్‌ రంగులనే వేస్తారు. ఎల్లో ఆరెంజ్‌ లాగే సిల్వర్‌ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....