కరోనా వారియర్స్ 47వ రోజు అన్న వితరణకు ప్రవాస భారతీయుల చేయూత

కరోనా వారియర్స్ 47వ రోజు అన్న వితరణకు ప్రవాస భారతీయుల చేయూత
హైదరాబాద్,మే 12  ఇయ్యాల తెలంగాణ :

సనత్ నగర్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కీ!శే! యేచన్ సుభాష్ కుమార్తె, అల్లుడు, అమెరికాలో నివసించే ప్రవాస భారతీయులు అలకంటి శ్వేత కిరణ్ కుమార్ లు వారి జ్యేష్ఠ పుత్రుడు చి. సాత్విక్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా భాజపా కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ నిర్వహిస్తున్న “ఫీడ్ ది నీడి”  47వ రోజు కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినట్లు కార్యనిర్వాహకులు భాజపా  మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు లు తెలిపారు.  భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు తగు ఏర్పాట్లు చేసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యేచన్ అవినాష్ తో కలిసి స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద అన్నార్థులకు ఆహార పొట్లాల వితరణ చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, నరేష్ అరుణ్ గౌడ్, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను, జె కె ఠాకూర్   తదితరులు సహకారం అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....