కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు అందాలి అధికారుతో సిఎం కెసిఆర్‌

కరోనా నివారణ చర్యల్లో రాజీలేదు


కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు  అందాలి

అధికారుతో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,మే11(ఇయ్యాల తెలంగాణ ):  కరోనా నివారణ చర్యలు , లాక్‌డౌన్‌ అంశాల పై ఉన్నతాధికారుతో సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు  తీసుకోవాని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నివారణ చర్యలతో పాటు కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలన్నారు. కరోనా బాధితులకు ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు  అందించాలని సూచించారు. కరోనా ఎంతకాలం  ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిరదన్నారు. కరోనా ప్రభావం ఉన్నా జీవనం సాగే విషయంపై వ్యూహం అవసరమన్నారు. కాంటాక్ట్‌ వ్యక్తుల పరీక్షలు  జరగాలి. ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకకుండా క్వారంటైన్‌ నిబంధనలు  పాటించాలని ఆదేశించారు. అన్ని రకాల పరికరాలు, మందు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్యపరంగా అత్యుత్తమంగా స్పందిస్తామన్నారు. కరోనాతో పోరాడుతూనే ఇతరత్రా సిద్ధం కావాల్సి ఉందన్నారు. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు  కొనసాగాలి అని సీఎం చెప్పారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సండలింపుతో కొన్ని పనులు  జరుగుతున్నాయని సీఎం తెలిపారు. భవిష్యత్‌లో సడలింపు అమలు పై ప్రతిపాదనలు  ఇవ్వాలి. జోన్ల వారీగా అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపాదనలు  ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారు. సొంత వాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరమైన ఆందోళన తలెత్తుతుంది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయం అని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నం. మళ్లీ ఆ కూలీలు  వస్తున్నారు. తెలంగాణ రైసు మిల్లులో  పనిచేసే బీహార్‌ కార్మికుల  ప్రత్యేక రైలు  ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తలు  తీసుకోవాలి అని సీఎం అన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ నిబంధనలు  ఖచ్చితంగా పాటించాలి. అలక్ష్యం చేయవద్దు. పాజిటివ్‌/యాక్టివ్‌ కేసులు  లేని జిల్లాను ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. పాజిటివ్‌ కేసులు  లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు  నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్టాల  నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాని సీఎం కేసీఆఆర్‌ కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....