’’కన్యాకుమారి’’ Movie నుంచి తిరుపతి క్యారెక్టర్‌ పరిచయం

’’కన్యాకుమారి’’ సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్‌ పరిచయం చేస్తూ రైతు టీజర్‌ రిలీజ్‌

గీత్‌ సైని, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా ‘‘కన్యాకుమారి’’. ఈ చిత్రాన్ని రాడికల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై దర్శక నిర్మాతగా సృజన్‌ రూపొందిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘‘కన్యాకుమారి’’ సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్‌ ను పరిచయం చేస్తూ రైతు టీజర్‌ రిలీజ్‌ చేశారు.

రైతు టీజర్‌ ఎలా ఉందో చూస్తే ` శ్రీకాకుళం జిల్లాలోని పెంటపాడులో ఐదు ఎకరాల రైతు తిరుపతి. ఏడో తరగతి చదువుకున్న తిరుపతి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ వృత్తే అతని పెళ్లికి అడ్డుగా మారుతుంటుంది. సంబంధాల కోసం వెళ్లిన చోటల్లా ఉద్యోగస్తుడైన కుర్రాడికే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అంటారు. తిరుపతి రైతు అనే చిన్నచూపు చూస్తుంటారు. బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లతో ఛాలెంజ్‌ చేస్తాడు తిరుపతి. ఈ యువ రైతు చేసిన సవాలును నిలబెట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూడాలి. ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌ గా ఉన్న రైతు టీజర్‌ ఆకట్టుకుంది.

నటీనటులు ` గీత్‌ సైని, శ్రీచరణ్‌ రాచకొండ

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....