ఓ షూలోకి దూరిన కింగ్‌ కోబ్రా.. సోషల్‌ విూడియాలో వైరల్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 10 (ఇయ్యాల తెలంగాణ ): మన కండ్ల ఎదుటపాము కనిపిస్తే.. అక్కడ్నుంచి పరుగెడుతాం. అంతటి భయంకరమైన కింగ్‌ కోబ్రా.. ఓ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది.ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. షూలోకి దూరింది నాగుపాము. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్‌ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సుశాంత నంద ఎక్స్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....