ఏడుపాయల దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన హరీష్‌ రావు

మెదక్‌, మార్చి 1 (ఇయ్యాల తెలంగాణ) :   మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  ఏడుపాయల వన దుర్గామాత జాతరను రాష్ట్ర ఆర్ధిక, వైద్యశాఖ మంత్రి  హరీష్‌ రావుప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు . మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డితో కలసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి హరీష్‌ రావు దంపతులకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి హరీష్‌ రావు విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. రూ.100 కోట్లతో ఏడుపాయల ఆలయం వద్ద ఫౌంటెన్స్‌ , క్వార్ట్జ్‌ లు ,ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ను సింగూర్‌ కు లింక్‌ చేయడం వల్ల ఏడుపాయల వద్ద నిరంతరం నీళ్లు ఉంటాయన్నారు. గతంలో ఏడుపాయల వద్ద నీళ్ళ కోసంఅనేక ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో సింగూర్‌ కు నీళ్లు వస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు  పనులు కానేకావు అని హేళన చేశారు… కానీ నేడు ఆ నీటిని మనం చూస్తున్నామని అన్నారు. మల్లన్నసాగర్‌  అంటే జల ప్రవాహిని, శివుడి నెత్తి విూద నుండి గంగ కిందికి దుంకినట్టు నీళ్లు వస్తున్నాయని.. ఇకపై మనకు నీటి కొరత అనేది రాదన్నారు. మల్లన్నసాగర్‌ నీళ్ల తో మెదక్‌ జిల్లా ను సస్యశ్యామలం చేస్తామన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....