ఎల్లమ్మ దేవాలయం వద్ద ఈటెల కు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం

సనత్ నగర్, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) :కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఈటల గెలుపు కోసం కోరిన మొక్కును పార్టీ శ్రేణులు శుక్రవారం పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హుజూరాబాద్ శాసన సభ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా అననతరం అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో నువ్వా నేనా అన్నట్టు జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో తిరిగి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నేపథ్యంలో, ఆయన భారీ మెజారిటీ తో గెలిస్తే జంటనగరాలలోనే ప్రఖ్యాతి గాంచిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేస్తామని బీజేపీ మల్కాజగిరి ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఎస్ టి మోర్చా ప్రెసిడెంట్ కాట కుమార్ మరియు గంగాధర్ గౌడ్ లు సంకల్పించడంతో వారి మొక్కు చెల్లించడానికి దేవాలయానికి ఈ రోజు మధ్యాహ్నం విచ్చేయగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్ లు ఈటెల రాజేందర్ ను ఘనంగా స్వాగతించారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈటెల రాజేందర్ ను వేదాశీర్వచనాలతో దీవించారు. అనంతరం బీజేపీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకూరి శ్రీనివాస్ రావు, చరణ్ సింగ్, కర్రే భాస్కర్, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, సి వి శ్రీనివాస్, రాజు గౌడ్, రాము గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....