ఎప్రిల్‌ 8న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమా విడుదల..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, ఖీవనిజీతిబబజీనిఞవ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్‌ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్‌ కూతురు అతిథి శంకర్‌ ఈ పాట పాడారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ మేకోవర్‌ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్‌ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్‌ కూడా లేకుండా ఙ/ం సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.నటీనటులు: వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....