ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘిస్తే ఉపేక్షించం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి

కోరుట్ల, అక్టోబర్ 19  (ఇయ్యాల తెలంగాణ ):ఎవరైనా ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘిస్తే

ఉపేక్షించబోమని కోరుట్ల సీఐ ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు..పట్టణంలోని కొత్త బస్టాండ్‌ జంక్షన్‌ లో తోపాటు ప్రధాన కూడలిలో గురువారం సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సై కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు..అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నైపద్యంలో గురువారం వాహనాల్లో ఏమైనా వస్తువులు డబ్బులు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించారు. .. కొత్త బస్టాండ్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్లే బస్సులు, నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లే టిఎస్‌ ఆర్టీసీ బస్సులు,ఇతర ప్రైవేట్‌ వాహనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కోరుట్ల మండలాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్నారు.. అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజలు కోడ్‌ ను ఉల్లఘించొద్దన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు  గురికాకుండా రాజ్యాంగం కల్పించిన తమ అమూల్యమైన ఓటునువినియోగించుకోవాలని సూచించారు.. నిబంధనలు అతిక్రమించి డబ్బులు, మద్యం తరలించడం ఇండ్లల్లో నిల్వ చేయడం నేరమని స్పష్టం చేశారు..ఈ తనిఖీల్లో ఎస్సై కిరణ్‌ కుమార్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌ ప్రవీణ్‌ కుమార్‌,ఏఎస్సై లు రాజేందర్‌,సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజయ్య, కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు విజయ్‌, సత్తయ్య, ఐలయ్య,రమేష్‌, తిరుపతి,శంకర్‌,నాజీర్‌ తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....