‘ఉరుకు పటేల’ First Look విడుదల

తేజస్‌ కంచర్ల హీరోగా లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ తేజస్‌ కంచర్ల. ఇప్పుడు మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలతో సినిమాలు చేయటంపై తన దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజస్‌ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’తో ఆడియెన్స్‌ను అలరించబోతున్నారు. ‘గెట్‌ ఉరికిఫైడ్‌’ సినిమా ట్యాగ్‌ లైన్‌.

గురువారం మేకర్స్‌ ‘ఉరుకు పటేల’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే తేజస్‌ కంచర్ల పరిగెడుతుంటే అతని వెనుక కత్తిని ఎవరో విసిరేసినట్లు కనిపిస్తుంది. మరో వైపు మంగళసూత్రం, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌, పాల క్యాన్‌ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది గ్రావిూణ నేపథ్యంలో భావోద్వేగాల ప్రధానంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంపొందించేలా ఉంది.

లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....