ఉప్పల్‌ లో చేతులెత్తేసిన JV బిల్డర్స్‌ అండ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ Real Estate కంపెనీ.


👉 ఉప్పల్‌ లో చేతులెత్తేసిన జెవి బిల్డర్స్‌ అండ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ రియలేస్టేట్‌ కంపెనీ.

👉 పరారి లో కంపెనీ  పరారి లో కంపెనీ యాజమాన్యం వేలూరి లక్ష్మీ  నారాయణ, జ్యోతి            దంపతులు.

ఉప్పల్‌, మార్చి 19 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ ఉప్పల్‌ లో పెట్టుబడుల పేరుతో జేవి బిల్డర్స్‌ అండ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌  రియల్‌ ఎస్టేట్‌  కంపెనీ సుమారు ఐదు వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకూ సామాన్య ప్రజల నుండి వసూలు చేసి బోర్డు తిప్పేయడతో బాధితులు తమకు న్యాయం చెయ్యాలని ఉప్పల్‌ పీఎస్‌ ముందు నిరసన చేపట్టారు.

తమ సంస్థ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన జెవి బిల్డర్స్‌ అండ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాజమానులు వేలూరి లక్ష్మీ  నారాయణ, జ్యోతి దంపతులను అరెస్టు చెయ్యాలని బాధితులు డిమాండ్‌ చేశారు.సీఎం రేవంత్‌ రెడ్డి దీనిపై దృష్టి సారించి తమకు న్యాయం జరిగేటట్లు చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.

సుమారు 500 మంది ఏజెంట్‌ లను ఏర్పాటు చేసుకొని, సుమారు 7000 మంది కొనుగోలు దారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్‌ ఓనర్స్‌ వేలూరి లక్ష్మీ  నారాయణ, జ్యోతి దంపతులు .

భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసం.

జనగామ ప్రాంత శివారులో  తక్కువ రేట్‌ లలో భూములు తీసుకొని బై బ్యాక్‌ ఆఫర్‌ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్‌ లాండ్‌ గా రిజిస్ట్రేషన్‌ చేసారు. కాని చాలా కస్టమర్స్‌ కి అగ్రిమెంట్‌ విూదనే మినిమం లక్ష కట్టితే నెలకు 7000/` చొప్పున, 20 నెలలు 140000/` అని కొన్ని నెలలు ఇచ్చి అందరిని మోసం చేసిన వైనం.

బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్‌ పోలీసులు 

కాగా గతంలో వీరిపై పలు చీటింగ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....