ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

ముగ్గురు మృతిచెందగా, మరో 17 మంది గల్లంతు

కేదార్‌నాథ్‌ ఆగష్టు 5  ఇయ్యాల తెలంగాణ 

 ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని కేదార్‌నాథ్‌కు 16 కిలోవిూటర్ల దూరంలో ఉన్న గౌరికుండ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 17 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గౌరీకుండ్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు. భారీ స్థాయిలో రాళ్లు, మట్టిపెల్లలు పడడంతో.. రోడ్‌సైడ్‌ ఉన్న షాపులు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతో పాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు జిల్లా అధికారులు వెల్లడిరచారు.ఉత్తరకాశీలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్‌ ప్రదేశ్‌తో ఉన్న బోర్డర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అరాకోట్‌`చిన్వా రూట్లో ఉన్న మోల్దీ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. డజన్ల సంఖ్యలో స్థానిక గ్రామస్థులతో సంబంధాలు తెగిపోయాయి. ఆ రూట్లో వెళ్తున్న ప్రయాణికులు ఎక్కడిక్కడ నిలిచిపోయారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....